అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal Sub Registrar ACB | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఒక ప్రభుత్వ అధికారి గుట్టును అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రట్టు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో వరంగల్ (R.O) సబ్ రిజిస్ట్రార్-II గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దావులూరి ఆనంద్ ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం (20.05.2026) ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దిమ్మతిరిగే భారీ అక్రమాస్తులు వెలుగుచూశాయి.
Warangal Sub Registrar ACB | మార్కెట్ విలువలో..
ప్రాథమిక విచారణ, సోదాల అనంతరం అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ రూ. 1,94,01,765/- (రూ. ఒక కోటి తొంభై నాలుగు లక్షల ఒక వెయ్యి ఏడు వందల అరవై ఐదు) గా తేలింది.
అయితే ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల ప్రకారమేనని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Warangal Sub Registrar ACB | దొరికిన స్థిరాస్తుల వివరాలు:
రెండు భారీ నివాస గృహాలు: వీటి విలువ దాదాపు రూ. 71,56,708/-
ఆరు ఓపెన్ ప్లాట్లు: వీటి విలువ రూ. 28,37,000/- కు పైగా
దావులూరి ఆనంద్ తన సర్వీసు కాలంలో భారీగా లంచాలు మరిగి, దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ నిర్ధారించింది. తనిఖీల్లో లభించిన చరాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
నగదు (Cash): రూ. 24,50,450/-
బ్యాంక్ బ్యాలెన్స్: రూ. 7,05,367/-
గృహోపకరణాలు: రూ. 6,07,700/- విలువైన వస్తువులు
బంగారు ఆభరణాలు: 819.500 గ్రాములు ( 82 తులాల బంగారం)
వెండి వస్తువులు: 2264.500 గ్రాములు (2 కిలోలకు పైగా)
వాహనాలు: ఒక కారు, రెండు బైక్‌లు (విలువ రూ. 13,25,000/-)
Warangal Sub Registrar ACB | అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు
నిందితుడు దావులూరి ఆనంద్‌పై అవినీతి నిరోధక చట్టం, 1988 (సవరణ చట్టం 2018) లోని సెక్షన్ 13(1)(b) r/w 13(2) కింద కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ ఏసీబీ పీఆర్వో (P.R.O) ఒక ప్రకటనలో తెలిపారు.
సదరు అధికారికి సంబంధించి ఇంకా ఏవైనా బినామీ ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో తదుపరి విచారణ ముమ్మరంగా సాగుతోందని వెల్లడించారు.
లంచం అడిగితే 1064 నెంబరుకు ఫోన్ చేయండి
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!


