అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Rains Today | హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో చెదురుమొదురు వర్షాలు ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, బొల్లారం, యాప్రాల్, హకీంపేట్, షామీర్‌పేట్, కీసర, వాటి పరిసర ప్రాంతాల్లో రాబోయే గంట వ్యవధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Hyderabad Rains Today | మెరుపులతో కూడిన తుపాను..
రాత్రి సమయంలో నగరంలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, రాత్రంతా ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం శ్రేయస్కరమని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు వహించాలంటున్నారు.