అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Comments | సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని సూచించారు. కొందరు పన్నులు కట్టడం లేదన్నారు. వారిని పట్టుకొని, ట్యాక్స్ బకాయిలు వసూలు చేయాలని, ప్రభుత్వ ఆదాయం పెంచాలని ఆదేశించారు.
తెలంగాణ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు వివిధ బ్యాంక్‌లతో ప్రభుత్వం ప్రభుత్వం ఎంవోయూ (MoU) కుదుర్చుకుంది. ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ బీమా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కార్మికులకు రూ.కోటి ప్రమాదబీమా అందిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి (Singareni)లో ఇప్పటి వరకు 45 మంది కార్మికులకు ప్రమాద బీమా అందించామని చెప్పారు.
Revanth Reddy Comments | గుంపు మేస్త్రీనే..
తాను గుంపు మేస్త్రీనే సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గుంపు మేస్త్రీ అని సోషల్ మీడియాలు పలువురు ట్రోల్ చేస్తుండటంపై ఆయన స్పందించారు. ‘ఈ గుంపు అంతా నాదే.. నేను గుంపు మేస్త్రినే.. కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటారు.. కానీ, నేను అలా చెప్పుకోను.. రేవంతన్న అని పిలిస్తేనే నాకు ఆనందం” అని ముఖ్యమంత్రి అన్నారు. పదవులు మారుతుంటాయి.. కానీ, రేవంతన్న అనేది శాశ్వతంగా ఉంటుందన్నారు.
Revanth Reddy Comments | వడ్డీలు తగ్గించాం

గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చారని సీఎం పేర్కొన్నారు. కేంద్రంతో మాట్లాడి 11 శాతంగా ఉన్న వడ్డీలను 7.5 శాతానికి తగ్గించామని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేయకుండా తన కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డు (RRR), మెట్రో విస్తరణ చేద్దామన్నా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను గుంపు మేస్త్రి అని అవహేళన చేసినా పట్టించుకోనని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, మంత్రులు-ప్రజలతో కూడిన ఈ గుంపే తన బలం, ప్రతిష్ట అని స్పష్టం చేశారు. తన దగ్గర దొరలం అని గొప్పలు చెప్పుకునే పోకడలు లేవని కూడా చెప్పారు. pic.twitter.com/1Y8PQxrGnh
— TG Govt Updates (@TGGovtUpdates) June 25, 2026
దీనిని కూడా చదవండి : Sanjay Raut | శివసేన (యూబీటీ) చీలికపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు