Indiramma Housing | పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన

హైదరాబాద్​ నగరం పరిధిలో పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing | హైదరాబాద్​ నగరం (CURE​) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  (Ponguleti)కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్‌డీవో, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, తదితర అంశాలపై గురువారం సమీక్షించారు.

క్యూర్ పరిధిలో నియోజకవర్గాన్నియూనిట్​గా తీసుకొని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. ఇప్పటికే 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. మిగతా స్థలాలను ఈ నెల 28లోగా ఖరారు చేయాలని ఆదేశించారు.

Indiramma Housing | కార్యాలయాలకు భవనాలు

minister 2

క్యూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్న ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళా లబ్దిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ (Housing Corporation) ఆధ్వర్యంలో ఒకే మోడల్​లో ఆర్​డీవో (RDO), తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Comments | ఉద్యోగులు గంట అదనంగా పని చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *