అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Poor Housing Scheme | పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో వివిధ వృత్తుల్లో ఉపాధి చేసుకుంటున్నా పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో ఆదివారం పలువురికి డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోందని, ఆ జాప్యానికి ప్రభుత్వ ప్రతినిధిగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇకపై అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలులో ఇటువంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
Poor Housing Scheme | పని చేసే ప్రాంతంలో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వం పేదల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని గృహ నిర్మాణ విధానాన్ని రూపొందించిందని తెలిపారు. పేదలు పని చేసే ప్రాంతాలకు దూరంగా కాకుండా, వారు ఉపాధి చేసుకుంటున్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి అందించేందుకు విలువైన ప్రభుత్వ భూములను కూడా వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
Poor Housing Scheme | 48 గంటల్లో రేషన్ కార్డు
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించామని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, అర్హత గల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
దీనిని కూడా చదవండి : Kishan Reddy HYDRAA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్