Yellareddy Indiramma Houses | ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి..: ఎమ్మెల్యే మదన్​ మోహన్ ​

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Indiramma Houses | ఎల్లారెడ్డి నియోజకవర్గానికి(Yellareddy Constituency) మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు(indiramma housing scheme) మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్​ మోహన్ (mla madan mohan) కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, హౌసింగ్ ఎండీ గౌతమ్​తో కలిసి నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.

Yellareddy Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లు.. డబుల్ బెడ్​రూం ఇళ్లపై సమీక్ష

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు, డబుల్​ బెడ్​రూం ఇళ్ల పురోగతిపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్​మోహన్​ మాట్లాడుతూ.. పథకాల అమలును వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గానికి మరిన్ని ఇళ్ల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Yellareddy Indiramma Houses | పారదర్శకత.. నాణ్యతకు ప్రాధాన్యం

లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. 2014కు ముందు ఇళ్లు మంజూరయ్యాయనే కారణంతో ప్రస్తుతం మంజూరు పొందిన వారికి బిల్లులు రావడం లేదని, దీనిని వెంటనే పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఫోర్​ వీలర్ వాహనం కొనుగోలు చేసిన పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోవడం అన్యాయమని, వారికి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తండాలు ఎక్కువగా ఉండటంతో, అక్కడ గుడిసెల స్థానంలో ఇళ్లు నిర్మించేందుకు ఫారెస్ట్ శాఖ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి గిరిజనులకు గృహ నిర్మాణానికి అనుమతులు కల్పించాలని మంత్రిని కోరారు.

ఇది కూడా చదవండి: Petrol Shortage | కామారెడ్డిలో పెట్రోల్​ బంక్​లు బంద్​.. కొరతే కారణమంటున్న నిర్వాహకులు

 

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *