నిజామాబాద్Petrol Shortage | కామారెడ్డిలో పెట్రోల్​ బంక్​లు బంద్​.. కొరతే కారణమంటున్న నిర్వాహకులు

Petrol Shortage | కామారెడ్డిలో పెట్రోల్​ బంక్​లు బంద్​.. కొరతే కారణమంటున్న నిర్వాహకులు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. కామారెడ్డి పట్టణంలో సోమవారం పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

అక్షరటుడే, కామారెడ్డి: Petrol Shortage | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడా పెట్రోల్ (petrol bunks), డీజిల్ కొరత లేదు. అయితే అనూహ్యంగా సోమవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

Petrol Shortage | సాయంత్రం నుంచి నోస్టాక్​..

పట్టణంలో (kamareddy news) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి కొరత లేకుండా కొనసాగిన పెట్రోల్ బంకులు సాయంత్రం నో స్టాక్ అంటూ మూసివేశారు. దాంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం కామారెడ్డి పట్టణం మొత్తం చక్కర్లు కొట్టారు. నిజాంసాగర్​ చౌరస్తాలో ఉన్న ఒకే ఒక్క పెట్రోల్​ బంక్​లో పెట్రోల్​ డీజిల్​ ఉండడంతో వాహనదారులు క్యూ కట్టారు. మరికొందరు మళ్లీ పెట్రోల్ కొరత ఎక్కడ వస్తుందోనని వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుని బాటిల్స్​లో సైతం పెట్రోల్ వేసుకుని వెళ్లారు. పెట్రోల్ కొరతకు కారణాలను బంక్​ సిబ్బంది వద్ద ఆరా తీయగా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండడంతో పెట్రోల్, డీజిల్ కోసం డీడీలు చెల్లించలేదని తెలిసింది. వరుసగా రెండు రోజులు బ్యాంకులు సెలవు కావడమే పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమని సిబ్బంది పేర్కొన్నారు. నేడు బంక్​ల యాజమాన్యాలు డీడీలు చెల్లించేందుకు క్యూ కట్టారని, నేటి రాత్రి వరకు పెట్రోల్, డీజిల్ చెల్లించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: KTR on Kavitha Party | కవిత పార్టీపై కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....