అక్షరటుడే, బాన్సువాడ : Nursing Graduation Day | విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు వినియోగించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భారత్ గార్డెన్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల తొలి గ్రాడ్యుయేషన్ డే, వీడ్కోలు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
Nursing Graduation Day | వైద్యరంగంలో సేవాభావంతో ఉండాలి..
పోచారం (MLA Pocharam) మాట్లాడుతూ.. వైద్యరంగంలో సేవాభావంతో ఉండాలన్నారు. అయితేనే వారికి సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణతి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kalki Cheruvu Repairs | బుంగ మరమ్మతుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే పోచారం