Armed Reserve Police | ఆర్మ్​డ్​ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయం

ఆర్మ్​డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Armed Reserve Police | ఆర్మ్​డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఆర్మ్​డ్ రిజర్వ్ విభాగాన్ని ఎస్పీ పరిశీలించారు.

Armed Reserve Police | పరేడ్​ మైదానంలో..

పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాన్ని తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది పరేడ్​ను పరిశీలించి క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం ఆయుధాగారం, స్టోర్​ను తనిఖీ చేసి ఆయుధాల వినియోగం, భద్రత, నిర్వహణ విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాంబు స్క్వాడ్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్ అనుమానాస్పద వస్తువులను గుర్తించే విధానాన్ని తిలకించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆర్మ్​డ్ రిజర్వ్ విభాగంలోని వివిధ విభాగాల ఫైళ్లు, రికార్డులను తనిఖీ చేసి వాటిని ఎప్పటికప్పుడు నవీకరిస్తూ క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రికార్డుల సక్రమ నిర్వహణ పోలీసు శాఖ పనితీరుకు ప్రతిబింబమని తెలిపారు.

Armed Reserve Police | ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో కీలకపాత్ర..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా ప్రశాంత వాతావరణంలో కొనసాగడంలో ఆర్మ్​డ్ రిజర్వ్ సిబ్బంది నిరంతర విధి నిర్వహణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్​డ్ రిజర్వ్ సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని గుర్తించి రివార్డులు అందజేస్తామని తెలిపారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ సంతోష్​తో పాటు కృష్ణ, నవీన్​లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్మ్​డ్ రిజర్వ్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కృష్ణ, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: El Nino Nizamabad | ఎల్​నినోపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *