అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Child Protection Awareness | బాలల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి అన్నారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్ – బాలలపై లైంగిక నేరాల నిరోధానికి గాను మహాత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyotibapule) బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Child Protection Awareness | బాలలపై లైంగిక నేరాలను అరికట్టాలి..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు నీరజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లక్ష్మణచారి మాట్లాడుతూ..పిల్లలకు తమ హక్కుల గురించి, మంచి స్పర్శ–చెడు స్పర్శ గురించి వివరించాలన్నారు. అపరిచితులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి వయస్సుకు తగిన రీతిలో అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుష్మిత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు పెంట శ్రీనివాస్, ఆడెపు వేణు, కళ్యాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్