Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Prajavani Rajanna Sircilla | ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) తెలిపారు. కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 163 అర్జీలు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

Prajavani Rajanna Sircilla | ఆర్డీవో కార్యాలయంలో..

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు దరఖాస్తులు రాగా, వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఐదు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు ప్రజావాణి ఎంపీడీఓలు నిర్వహించి.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి నాలుగు, ఇల్లంతకుంట మండలంలో ఆరు, గంభీరావుపేట మండలంలో రెండు, కోనారావుపేట మండలంలో మూడు, ముస్తాబాద్ మండలంలో ఆరు, తంగళ్లపల్లి మండలంలో ఒకటి, వీర్నపల్లి మండలంలో ఒకటి, వేములవాడ అర్బన్​లో మూడు, వేములవాడ రూరల్ మండలంలో మూడు, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయానికి రెండు దరఖాస్తులు వచ్చాయి.

Prajavani Rajanna Sircilla | సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణితో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందన్నారు.

ఇది కూడా చదవండి..: Thummidihatti Project | మహారాష్ట్ర సీఎంతో రేవంత్​రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై చర్చ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *