అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sarpanch Forum President | జిల్లాలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఓ వ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని.. అతడి ఎన్నిక చెల్లదని సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
Sarpanch Forum President | స్వయంప్రకటనపై అభ్యంతరం
ఈ సందర్భంగామునిపల్లి సాయిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని (Nizamabad) సర్పంచ్‌లకు, అలాగే 32 మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక వ్యక్తి తానే జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చెల్లదన్నారు. జిల్లాలోని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులందరి అభిప్రాయాలు, సమన్వయం లేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలకు గుర్తింపు లేదని తెలిపారు.
Sarpanch Forum President | సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం..
జిల్లాలో సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఫోరం నిరంతరం పనిచేస్తోందని సాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోరం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా జీపీల సమస్యలు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని చెప్పారు. సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఫోరం కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి, బాల్కొండ ఇన్‌ఛార్జి సునీల్‌రెడ్డి తదితరులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఫోరం ప్రతినిధులు తెలిపారు.
Sarpanch Forum President | పూర్తి మద్దతు ఉంది..
అనంతరం ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డికి జిల్లాలోని అన్ని మండలాల సర్పంచ్‌ల మద్దతు ఉందని తెలిపారు. జిల్లాలోని 300 మందికి పైగా సర్పంచ్‌లు ఆయనకు అండగా ఉన్నారని, ఫోరం అధ్యక్షుడిగా ఆయనకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్దన్, ఉపాధ్యక్షులు చింతం ఉమారాణి సంజీవ్, రూరల్ అధ్యక్షులు వాసు, మండలాల అధ్యక్షులు సుదర్షన్, భూమేశ్, శ్రీను, జలేందర్, రాజు, మోహన్, నీలిమా సాయగౌడ్, శ్రీనివాస్‌తో పాటు దాదాపు 25 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ration Rice Recycling | రేషన్ బియ్యం.. మిలర్లకు వరం.. యథేచ్ఛగా రీసైక్లింగ్ దందా