ACB Raids | బోధన్​ పోలీస్​ స్టేషన్​లో ఏసీబీ సోదాల కలకలం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | బోధన్​ (Bodhan) పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఠాణాలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికినట్లు సమాచారం. ఓ పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ACB Raids | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఏసీబీ వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి :  Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *