ఖమ్మంTamil Nadu Alliance| తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ 'TVK' పార్టీకి కాంగ్రెస్ అధికారిక...

Tamil Nadu Alliance| తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ ‘TVK’ పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా, తిరు సి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Alliance|తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా, తిరు సి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. లౌకిక , సంక్షేమ ప్రభుత్వం కావాలని తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ (AICC) వెల్లడించింది.

Tamil Nadu Alliance|మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలనే షరతు..

ఈ మద్దతు ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన నిబంధనను విధించింది. భారత రాజ్యాంగంపై నమ్మకం లేని ఎటువంటి మతతత్వ శక్తులను (Communal forces) ఈ కూటమిలోకి చేర్చుకోకూడదనే షరతుపైనే టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజ్యాంగ సూత్రాలను కాపాడటం , అమలు చేయడం తమ బాధ్యతగా కాంగ్రెస్ పేర్కొంది.

Tamil Nadu Alliance|భవిష్యత్తు ఎన్నికల్లోనూ కొనసాగనున్న కూటమి..

ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం కేవలం ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటుకే పరిమితం కాదని ప్రెస్ రిలీజ్ పేర్కొంది. పరస్పర గౌరవం , బాధ్యతలతో ఏర్పడిన ఈ కూటమి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్‌సభ , రాజ్యసభ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయనుందని ఏఐసీసీ ఇంచార్జ్ గిరీష్ చోడంకర్ తెలిపారు.

Tamil Nadu Alliance|ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ప్రతిజ్ఞ ..

ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని విజయ్ , రాహుల్ గాంధీ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారు. తమిళనాడులో పెరున్తలైవర్ కామరాజ్ పాలనా వైభవాన్ని తిరిగి తీసుకురావడంతో పాటు, తంతై పెరియార్ సామాజిక న్యాయం , డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాల సాధన కోసం ఈ కూటమి కృషి చేస్తుందని ప్రకటనలో వివరించారు.

 

ఇది కూడా చదవండి: Railway Bypass Launch | రైల్వే బైపాస్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Trap | లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా ఏసీబీకి పట్టుబడిన బోధన్​ ఎస్సై

అక్షరటుడే, బోధన్​: ACB Trap | బోధన్​ టౌన్​ ఎస్సై భాస్కరాచారి...

Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum Pension Hike | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న...

Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత

అక్షరటుడే వెబ్‌డెస్క్:Education Fee Regulation|సమాజంలో సమానత్వం , స్వేచ్ఛ కేవలం నాణ్యమైన...