Railway Bypass Launch | రైల్వే బైపాస్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Bypass Launch | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్​ నగరంలోని పరేడ్​ గ్రౌండ్​లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు రైల్వే పనులను ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖ రైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు రైలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిర్మించిన ‘కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్’ను మే 10న ప్రధానమంత్రి హైదరాబాద్ నుంచి జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు.

Railway Bypass Launch | రూ.292 కోట్లతో..

రైల్వే అనుసంధానాన్ని పెంపొందిస్తూ, రూ.292 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర ‘కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్’ నిర్మించారు. సికింద్రాబాద్, బల్హర్షా, విజయవాడ అనే మూడు ప్రధాన దిశల మీదుగా రైళ్ల రాకపోకలను ఇది మరింత సులభతరం చేస్తుందన్నారు. కాగా మోదీ నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) మామిడిపల్లి రైల్వే స్టేషన్​ను కూడా ప్రారంభించనున్నారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ప్రధాని సభను విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. భారీగా జన సమీకరణ చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: KTR Congress Allegations | రైతులను దగా చేసిన కాంగ్రెస్​ దొంగలు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *