తెలంగాణKTR Congress Allegations | రైతులను దగా చేసిన కాంగ్రెస్​ దొంగలు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR Congress Allegations | రైతులను దగా చేసిన కాంగ్రెస్​ దొంగలు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్​ పార్టీ దొంగలు వరంగల్​ రైతు డిక్లరేషన్​ పేరిట రైతులను దగా చేశారని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Congress Allegations | కాంగ్రెస్​ పార్టీ దొంగలు వరంగల్​ రైతు డిక్లరేషన్​ (Warangal Farmers Declaration) పేరిట రైతులను దగా చేశారని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభలో మాట్లాడారు.

కాంగ్రెస్​ పార్టీ (Congress Party) దొంగలు వరంగల్​ డిక్లరేషన్​ పేరిట రైతులను మోసం చేశారన్నారు. వరంగల్​లో సభ పెట్టి రాహుల్​ గాంధీ అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసా రూ.15 వేలు, వరి పంటకు బోనస్​ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ నేడు రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. రైతు డిక్లరేషన్​లో 34 హామీలు ఇచ్చారన్నారు. వాటిని నమ్మి ప్రజలు ఓటు వేస్తే.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు చేయడం లేదని మండిపడ్డారు.

KTR Congress Allegations | సీఎం ఏం చేస్తున్నట్లు

వరంగల్​ నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు సంగ్రామ సభ పెట్టామని కేటీఆర్​ అన్నారు. రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన డిక్లరేషన్​ ఎక్కడ ఉందని, ఆయన ఏడ పోయారని ప్రశ్నించారు. ఈ రోజు పంటలు అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్​రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్​రెడ్డి, రాహుల్​ గాంధీ ఫొటోలను బస్టాండ్​లలో అతికించి దొంగలున్నారు జాగ్రత్త అని రాయాలన్నారు.

KTR Congress Allegations | కరోనా కంటే డేంజర్​

కరోనా కంటే కాంగ్రెస్​ డేజంర్ అని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో పెట్టుబడి సాయం సకాలంలో జమ చేశామని గుర్తు చేశారు. కానీ నేడు ఒక్క పంటకు కూడా రైతు భరోసా జమ కావడం లేదని విమర్శించారు. రైతు బంధును ఎందుకు బంద్​ పెట్టారని సీఎం (CM Revanth Reddy)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెలకు ఒక ఎకరాకు డబ్బులు వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రైతు భరోసా (Rythu Bharosa) బంద్​ చేసి రాహుల్​ గాంధీకి డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్​కు కప్పం కట్టి సీఎం సీటును రేవంత్​రెడ్డి కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బాగోతం.. తల్లి-కొడుకుల గలీజ్ దందా వెలుగులోకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Traffic Restrictions Telangana| కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Traffic Restrictions Telangana| రాష్ట్రవ్యాప్తంగా తన కాన్వాయ్ లేదా ఇతర...

Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్​ పదవుల భర్తీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Nominated Posts | తెలంగాణ (Telangana)లో నామినేటెడ్...

Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి: పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై...

ACB Trap | బోధన్​ ఠాణాలో ఏసీబీ సోదాల అప్​డేట్​.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై..

అక్షరటుడే, బోధన్​: ACB Trap | బోధన్​ టౌన్​ ఎస్సై భాస్కరాచారి...