Palash Muchhal Case | పలాశ్ ముచ్చల్‌పై మోసం, ఎస్సీ/ఎస్టీ కేసు.. సాంగ్లీ పోలీసుల దర్యాప్తు ప్రారంభం

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్:Palash Muchhal Case | ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra)లోని సాంగ్లీ జిల్లాలో ఆయనపై మోసం మరియు కులదూషణ ఆరోపణలతో కేసు నమోదవడం సంచలనంగా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Palash Muchhal Case | పాతిక లక్షలు తీసుకొని…

ఫిర్యాదు వివరాల ప్రకారం, ఒక సినిమా ప్రాజెక్టు పేరుతో పలాశ్ ముచ్చల్ తన వద్ద నుంచి సుమారు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని విజ్ఞాన్ ప్రకాశ్ ఆరోపించారు. ప్రాజెక్టు గురించి స్పష్టత ఇవ్వకుండా డబ్బు వాడుకున్నారని, ఆర్థికంగా నష్టపరిచారని ఆయన పేర్కొన్నారు.ఇదే వ్యవహారంలో గత ఏడాది నవంబర్ 22న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో వెల్లడైంది. ఆ సమయంలో పలాశ్ ముచ్చల్ తన కులాన్ని ఉద్దేశించి దూషణాత్మక పదజాలం ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు.

ఈ ఆరోపణలను సీరియస్ గా పరిగణించిన పోలీసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు నమోదు నేపథ్యంలో పలాశ్ ముచ్చల్ వ్యక్తిగత జీవితం కూడా మళ్లీ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా స్మృతి మంధాన (Smriti Mandhana)తో ఆయన వివాహం రద్దయిందనే వార్తలు గతంలో వెలువడగా, ఇప్పుడు ఆమె సన్నిహితుడే ఫిర్యాదు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై సాంగ్లీ పోలీసులు (Sangli Police) సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, వాగ్వాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాగా ఈ ఆరోపణలపై పలాశ్ ముచ్చల్ నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. కేసు పురోగతిపై సినీ, క్రీడా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *