RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RB Choudhary | ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్​లోని ఉదయ్‌పూర్‌ (Udaipur) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

ఆర్‌బీ చౌదరి పలు భాషల్లో 90కి పైగా చిత్రాలు నిర్మించారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్​  (Super Good Films) సంస్థ పేరిట తెలుగులో రాజా, సూర్యవంశం, సుస్వాగతం చిత్రాలు తెరకెక్కించారు. రాజస్థాన్‌లోని తన స్వస్థలమైన ఉదయపూర్‌కు ప్రయాణిస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.

RB Choudhary | అనేక అవార్డులు

రాజస్థాన్​కు చెందిన చౌదరి తమిళ మహిళ అయిన మహ్జబీన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు సురేష్ తమ సొంత నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’లో చిత్రాలను నిర్మిస్తుండగా, జీవన్ వ్యాపారవేత్తగా ఉంటూ ఉక్కు సంస్థను నిర్వహిస్తున్నారు. జితన్ రమేష్ నటుడు, నిర్మాత కాగా, చిన్న కుమారుడు జీవా పలు సినిమాల్లో నటించారు. ఆర్​బీ చౌదరి అనేక అవార్డులు సాధించారు. తెలుగులో రాజా సినిమాకు ఆయనకు ఫిల్మ్​ఫేర్​ అవార్డు వచ్చింది.

 

దీనిని కూడా చదవండి : Fauji Movie | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్​కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *