సినిమాJayam Ravi Divorce | 'నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను' – జయం...

Jayam Ravi Divorce | ‘నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను’ – జయం రవి సంచలన ప్రకటన!

"నా పిల్లలు కచ్చితంగా ఈ వీడియో చూడాలి.. వాళ్ల నాన్న ఎంత బాధపడుతున్నాడో, వారి కోసం ఎంతగా తలపిస్తున్నాడో వాళ్లకు తెలియాలి!" — ఆవేదనతో జయం రవి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jayam Ravi Divorce | డబ్బు, హోదా, కోట్లాది మంది అభిమానుల ప్రేమ… ఇవన్నీ ఉన్నా జీవితంలో ‘ఫ్యామిలీ లైఫ్’ ప్రశాంతంగా లేకపోతే ఆ బతుకు ఎంత నరకప్రాయంగా మారుతుందో జయం రవి ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. తన భార్య ఆర్తితో నెలకొన్న విభేదాలు, ఆపై చోటుచేసుకుంటున్న పరిణామాలు అతన్ని మానసికంగా కుంగదీశాయి.

చివరికి విసిగిపోయిన రవి… “నా భార్య అధికారికంగా విడాకులు ఇచ్చే వరకు నేను సరికొత్త సినిమాల్లో నటించను.. సంతకం చేయను” అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Jayam Ravi Divorce | పిల్లల కోసం తండ్రి తపన..

ఒక స్టార్ హీరోగా ఎంతటి ఇమేజ్ ఉన్నా.. ఒక తండ్రిగా తన పిల్లలను చూసుకోలేకపోతున్నాననే బాధ జయం రవిని తీవ్రంగా వేధిస్తోంది. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు.

“కట్టుకున్న భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా, కనీసం నా కన్న పిల్లలను కూడా నన్ను కలవనివ్వడం లేదు. వాళ్లను నాకంట పడకుండా దాస్తున్నారు.”

“పిల్లలతో నేను మాట్లాడకుండా ఉండేందుకు వారి దగ్గర ఉన్న ఫోన్లను కూడా లాక్కున్నారు. నాతో కమ్యూనికేట్ చేయడానికి వీల్లేకుండా కట్ చేశారు.”

“సొంత తండ్రి ఎక్కడ వచ్చి కలుస్తాడో అన్న భయంతో.. పిల్లలను స్కూల్‌కి కూడా బాడీగార్డ్స్ కాపలా పెట్టి పంపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది?”

Jayam Ravi Divorce | తెరవెనుక కుట్రలు..

తనను మానసికంగా దెబ్బతీయడానికి ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని జయం రవి ఆరోపించారు. “నాకు వ్యతిరేకంగా కొందరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి నన్ను బద్నాం చేయడానికి, నాపై నెగెటివిటీ ప్రచారం చేయడానికి వాడుకుంటున్నారు. ఇవన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా?” అంటూ భార్య వైపు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, భార్యతో విడిపోయిన ఈ గ్యాప్‌లో జయం రవి మరో నటితో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ, విధి ఆడుతున్న వింత నాటకంలో… సదరు నటి కూడా  “నేను జయం రవితో బ్రేక్ అప్ చేసుకున్నాను” అని అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

Jayam Ravi Divorce | పెళ్ళాం పోరు అసలే ఉండకూడదు!

కట్టుకున్న భార్య ఏమో కోర్టు గడప తొక్కి విడాకులు ఇవ్వనంటూ వేధిస్తోంది.. కాబోయే భార్య అనుకున్న నటి ఏమో ‘నువ్వు నాకొద్దు’ అంటూ చేతులెత్తేసింది. అటు కెరీర్ ఆగిపోయి, ఇటు ఇద్దరు స్త్రీల మధ్య నలిగిపోతూ, కన్న పిల్లలకు దూరమై జయం రవి అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణనాతీతం.

ఈ ఘటన చూశాక సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా ఒకటే అనుకుంటున్నారు.. “మనిషికి ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద హోదా ఉన్నా.. ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. ఇంట్లో ప్రశాంతత లేకపోతే జీవితం నరకమే. ముఖ్యంగా పెళ్ళాం పోరు, కుటుంబ కలహాలు మనిషిని బతికుండగానే చంపేస్తాయి.” జయం రవి ఈ సంక్షోభం నుంచి త్వరగా బయటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath POCSO | బండి భగీరథ్ విచారణ పూర్తి.. మేడ్చల్ ఆసుపత్రికి తరలింపు.. మెజిస్ట్రేట్ నివాసం వద్ద భారీ భద్రత!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Bhagirath POCSO | రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం...

Adhika Jyeshta Masam | ఒకే ఏడాది రెండు జ్యేష్ఠ మాసాలు.. దీని గురించి శాస్త్రం ఏం చెబుతోందంటే

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Adhika Jyeshta Masam | జ్యోతిషశాస్త్రంలో అత్యంత పవిత్రమైన, అరుదైన...

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Chola Copper Plates | భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో మరో...