Ashu Reddy Case | ప్రేమ పేరుతో రూ.9 కోట్లు మోసం.. అషురెడ్డిపై కేసు నమోదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashu Reddy Case | బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన అషురెడ్డి మరోసారి వివాదాల్లో నిలిచారు. ఈసారి సోషల్ మీడియా (Social Media) పోస్టులతో, రియాలిటీ షోలతో కాకుండా మోసం ఆరోపణలతో పోలీస్ కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది.

హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు వివరాల ప్రకారం లండన్‌లో (London) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. భారత్‌కు వచ్చిన సమయంలో ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని బాధితుడి కుటుంబం పేర్కొంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చానని చెప్పి అతనితో సన్నిహితంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Ashu Reddy Case | వివాదాల్లో అషూరెడ్డి

ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర నుంచి తీసుకున్న డబ్బులతో కారు, బంగారం, ఫ్లాట్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి విషయం ఖరారు చేస్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు, శుభకార్యాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే అనంతరం పెళ్లిని వాయిదా వేస్తూ చివరకు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుడి తండ్రి యెనుముల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2018 నుంచి 2025 వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తం రూ.9.35 కోట్ల మేర తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదనంగా అషు రెడ్డి (Ashu Reddy) సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.

ashu

Ashu Reddy Case | హాట్​టాపిక్​

ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల కొనుగోలు వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక అషు రెడ్డి పేరు గతంలో కూడా కొన్ని వివాదాల్లో వినిపించింది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఆమె పేరు రావడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ ఆరోపణలను ఆమె ఖండిస్తూ డ్రగ్స్‌తో (Drugs) తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించి కూడా వార్తల్లో నిలిచింది. నెలవారీ చార్జ్‌తో ప్రత్యేక కంటెంట్ అందిస్తానని ప్రకటించడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ప్రస్తుతం ఈ మోసం కేసుతో మరోసారి వార్తల్లో నిలిచిన అషు రెడ్డి వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడే అవకాశముంది.

దీనిని కూడా చదవండి : Varanasi Movie | మెక్సికోలో ‘వారణాసి’ హంగామా.. గ్లోబల్ స్టేజ్‌పై రాజమౌళి-మహేష్ బాబు మ్యాజిక్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *