అక్షరటుడే, వెబ్‌డెస్క్: Varanasi Movie | దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి (Varanasi)’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. పాన్ వరల్డ్ లెవెల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రీచ్‌ను మరింత పెంచేందుకు మూవీ టీమ్ గ్లోబల్ ఆడియన్స్ (Global Audience)ను టార్గెట్ చేస్తోంది.
Varanasi Movie | 2026లో ‘వారణాసి’ స్పెషల్ అట్రాక్షన్
ఈ క్రమంలో మెక్సికోలో జరుగుతున్న ప్రముఖ పాప్ కల్చర్ ఈవెంట్ CCXP Mexico 2026లో ‘వారణాసి’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం. ఈ ఈవెంట్‌లో భాగంగా చిత్ర ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ పాల్గొని స్టేజ్‌పై సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ ‘వారణాసి’కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇదే వేదికపై సినిమా ప్రివ్యూ వీడియోను కూడా ప్రదర్శించగా, అక్కడి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించినట్లు సమాచారం.
Varanasi Movie | బీటీఎస్ వీడియోపై ప్రత్యేక చర్చ..
అంతేకాదు, దర్శకుడు రాజమౌళి (Director Rajamouli) ప్రత్యేకంగా రికార్డ్ చేసిన వీడియో మెసేజ్‌ను కూడా ఈ ఈవెంట్‌లో ప్లే చేశారు. ‘వారణాసి’ లోగోతో ఉన్న టీషర్ట్ ధరించి కనిపించిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే తన కట్టుబాటును మరోసారి వెల్లడించారు. మెక్సికో సంస్కృతి, ముఖ్యంగా మాయన్ నాగరికత తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. గతంలో ‘బాహుబలి’ చిత్రంలోని సిటీ డిజైన్‌కు చిచెన్ ఇట్జా వంటి నిర్మాణాలు స్ఫూర్తిగా నిలిచాయని వెల్లడించారు. నేను 25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా… కానీ మన సినిమా సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చేరినప్పుడు కలిగే ఆనందం వేరే. ‘RRR’తో నాకు అదే అనుభూతి దక్కింది. ‘నాటు నాటు’ పాటకు ప్రపంచం మొత్తం డ్యాన్స్ చేయడం చూసినప్పుడు నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో అర్థమైంది’’ అంటూ రాజమౌళి భావోద్వేగంగా తెలిపారు.
Varanasi Movie | ఈ చిత్రానికి గ్లోబల్ మార్కెట్‌లో భారీ క్రేజ్
ఈ ఈవెంట్‌లో ప్రదర్శించిన ‘వారణాసి’ బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోపై ప్రత్యేక చర్చ నడుస్తోంది. అది కేవలం ఈ ఈవెంట్ కోసం మాత్రమే రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో విడుదల చేయకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే అభిమానులు కొంత నిరాశ చెందే అవకాశముంది.మొత్తానికి, మెక్సికో (Mexico) వేదికగా ‘వారణాసి’కు లభించిన స్పందన ఈ చిత్రానికి గ్లోబల్ మార్కెట్‌లో భారీ క్రేజ్ తెచ్చిపెడుతోందనే సంకేతాలు ఇస్తోంది. రాజమౌళి – మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX— REFORMA (@Reforma) April 25, 2026
ఇది కూడా చదవండి..: Jana Nayagan Leak | జన నాయగన్ లీక్.. ఎడిటర్ సస్పెండ్

