అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toxic Event Accident | హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన భారీ సౌండ్ బాక్స్ సెటప్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ యువతి స్పృహ కోల్పోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Toxic Event Accident | భారీగా తరలివచ్చిన అభిమానులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Toxic Event Accident | కూలిన సౌండ్ బాక్సులు
ఈవెంట్ కొనసాగుతుండగా హీరో యశ్ వేదికపై మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయనను చూసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో ముందుకువచ్చారు. దీంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రాంగణంలోని ఫ్లడ్ లైట్ స్తంభం, భారీ స్పీకర్ బాక్సులు కిందపడిపోయాయి.
పలువురికి గాయాలు
ఘటనలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: Aug 23 Gold Prices | దూసుకుపోతున్న వెండి.. పసిడి పరిస్థితి ఏమిటంటే..