అక్షరటుడే వెబ్‌డెస్క్: CV Anand Warning | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో అధికారుల పనితీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అధికారుల పనితీరులో మార్పు రావాలని, ఎంత చెప్పినా వారిలో ఎలాంటి స్పందన కన్పించడం లేదని ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
CV Anand Warning | కఠిన చర్యలు తప్పవు..
“ఇప్పటికే ముగ్గురు, నలుగురు అధికారులను గుర్తించాం. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వారిలో మార్పు రాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, ఇకపై కూడా పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అసలు ఆ నలుగురు అధికారులు ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆ నలుగురు ఎవరు..?
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులకు గుబులు పుట్టిస్తున్న డీజీపీ CV ఆనంద్ వ్యాఖ్యలు
కొందరు అధికారుల పనితీరు మారాలని.. ఎంత చెప్పినా వారిలో మార్పు రావడం లేదని చెప్పిన డీజీపీ
ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేశామని.. మార్పు కనిపించకపోతే చర్యలు… pic.twitter.com/70dj8fOfo8
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 10, 2026
ఇది కూడా చదవండి: Molbio Diagnostics IPO | డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రారంభం