అక్షరటుడే,పెద్దకొడప్‌గల్: Anganwadi Inspections | మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Kamareddy Collector ) వస్తున్నారనే సమాచారంతో అధికారులు క్యూ కట్టారు. దీంతో స్థానికులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anganwadi Inspections | ఉన్నతాధికారులు వస్తేనే కదిలికలా..?
కలెక్టర్ పర్యటనకు సంబంధించిన సమాచారం అందగానే ఐసీడీఎస్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో హడావుడిగా తనిఖీలు నిర్వహిస్తూ రికార్డులు, పరిశుభ్రత, పౌష్టికాహార పంపిణీ, హాజరు నమోదులను పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేస్తూ లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు.

అయితే.. ఈ హడావుడి తనిఖీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యటనలు ఉన్నప్పుడే అధికారులకు అంగన్వాడీ కేంద్రాలు గుర్తుకు వస్తాయా.. అని నిలదీస్తున్నారు. సాధారణ రోజుల్లో పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని కేంద్రాల్లో లోపాలు నెలకొన్నాయని వారు పేర్కొన్నారు. అధికారులు ఇలాంటి తనిఖీలను కేవలం పర్యటనలకే పరిమితం చేయకుండా, నిరంతరం నిర్వహిస్తేనే అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడుతుందని వారన్నారు. నిత్యపర్యవేక్షణ ఉంటే లోపాలు వెంటనే గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుందని, అప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు అంటున్నారు.
ఇది కూడా చదవండి..: Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు: సీపీ సాయిచైతన్య