అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ramchander Rao Arrest | జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద నీళ్లు లేక ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్ల వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
సాగునీరు లేక జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ఇటీవల రైతులు స్వయంగా కాలువకు నీటి విడుదల చేశారు. అయితే పోలీసులు, అధికారులు మళ్లీ గేట్లు మూసివేశారు. దీంతో తమకు నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు మంగళవారం ఉదయం బయలు దేరారు. ఆయనను మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
Ramchander Rao Arrest | ప్రజాస్వామ్యం ఖూనీ
పోలీసులు తనను అడ్డుకుని, అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికం అని రామ్‌చందర్‌రావు అన్నారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తుంటే మార్గమధ్యంలోనే అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన బీజేపీ నిలబడుతుందని, వారి కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుంటారని, అధికారంలోకి వచ్చాక దాన్ని నలిపివేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు అరెస్ట్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. రైతులకు అండగా నిలిచేందుకు బీజేపీ నాయకులు బయలుదేరిన ప్రతిసారీ, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను మోహరించి అరెస్టులు చేస్తోందన్నారు. బీజేపీని చూసి ఎందుకంత భయం? రైతుల గొంతుకను వినిపించే హక్కును ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: TG Safe Inspections | డెయిర్ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు