Harish Rao | ప్రగతి రథం ఆగిపోయింది.. మళ్ళీ పరిగెత్తించేది బీఆర్‌ఎస్సే: హరీశ్‌రావు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Harish Rao | 25 వసంతాలు:

తెలంగాణ జాతి ఆత్మగౌరవం కోసం ఎగిసిన జెండా ఈ రోజుతో 25 వసంతాల మైలురాయిని చేరుకుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక అలుపెరుగని విప్లవమని కొనియాడారు. పాతికేళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక మహోజ్వల “లాంగ్ మార్చ్‌”గా అభివర్ణిస్తూ, స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఘాటుగా స్పందించారు. ఆయన మాటల్లోని అంశాలు..

Harish Rao | బీఆర్‌ఎస్ ఎప్పుడూ ప్రజల కోసమే:

ఉద్యమ కాలం నుండి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని, తెలంగాణ (Telangana)ను కంటికి రెప్పలా కాపాడుతుందని అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమం అడుగంటిందని మండిపడ్డారు. అరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల నినాదం: ప్రస్తుతం ప్రజలందరి నోటా “రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదం మార్మోగుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, గులాబీ జెండా మళ్లీ సగర్వంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ కొరత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *