జాతీయంKejriwal Court Letter | న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు.. హైకోర్టు జడ్జికి కేజ్రీవాల్ లేఖ

Kejriwal Court Letter | న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు.. హైకోర్టు జడ్జికి కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను విచారణకు హాజరుకావడానికి నిరాకరిస్తూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kejriwal Court Letter | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi Excise Policy Case) విచారణకు కోర్టుకు వ్యక్తిగతంగా, న్యాయవాది ద్వారా హాజరుకావడానికి నిరాకరిస్తూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మకు లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తి నుంచి తనకు న్యాయం జరుగుతుందనే ఆశ పోయిందన్నారు. మహాత్మా గాంధీ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.

న్యాయమూర్తి స్వర్ణ కాంత నుంచి న్యాయం జరుగుతుందనే ఆశ కోల్పోయానని. అందుకే మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అవసరం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. జస్టిస్ స్వర్ణ కాంత నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తనకు ఉందన్నారు.

Kejriwal Court Letter | న్యాయమూర్తిపై ఆరోపణలు

తనను తప్పుడు కేసులో ఇరికించారని, జైలుకు పంపారని, ఎన్నికైన ప్రభుత్వాన్ని అన్యాయంగా దించారని కేజ్రీవాల్ అన్నారు. కానీ చివరికి, సత్యం గెలిచిందన్నారు. ఫిబ్రవరి 27న కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ తీర్పును సీబీఐ వెంటనే హైకోర్టులో సవాలు చేయగా, ఈ కేసు జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ (Justice Swarna Kanta Sharma) ముందుకు వచ్చింది. ఆమె వద్ద తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. అందుకు రెండు కారణాలు చెప్పారు. మొదటిది తనపై తప్పుడు అభియోగాలు మోపిన అదే సైద్ధాంతిక పర్యావరణ వ్యవస్థ, న్యాయమూర్తి దాని అనుబంధ ప్లాట్‌ఫారమ్‌లతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించారు. జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ పిల్లలు ఇద్దరూ ప్రభుత్వ న్యాయవాదుల ప్యానెల్‌లో ఉన్నారని, కేసు కేటాయింపులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభావితం చేశారన్నారు.

Kejriwal Court Letter | తిరస్కరించడంతో..

ఆమెను కేసు నుంచి తప్పుకోవాలని తాను గౌరవంగా అభ్యర్థించానని కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఆమె అందుకు తిరస్కరించారని చెప్పారు. దీంతో తాను కోర్టుకు హాజరు కాకుడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేస్తానని ప్రకటించారు.

ఇది కూడా చదవండి..: Surat Murder Cae | సూరత్‌లో దారుణం.. భార్యను హత్య చేసి శవాన్ని సిమెంట్‌తో కప్పి దాచిన భర్త

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...