అక్షరటుడే, వెబ్డెస్క్: IRFC Jobs | రైల్వే రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (Indian Railway Finance Corporation Limited) శుభవార్త తెలిపింది. అసిస్టెంట్ ఎన్ఈ-5 లెవల్, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఈ1 లెవల్ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 23.
IRFC Jobs | భర్తీ చేసే పోస్టుల వివరాలు..
ఖాళీల్లో అసిస్టెంట్ ఎన్ఈ-5 లెవల్, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఈ1 లెవల్ పోస్టులు ఉన్నాయి. (16 అసిస్టెంట్ పోస్టులు, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు)
IRFC Jobs | అర్హతలు :
అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మంచిది.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కామర్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ సబ్జెక్ట్లలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. పని అనుభవం అవసరం. సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
IRFC Jobs | వయో పరిమితి :
18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
వేతనం : అసిస్టెంట్ పోస్టుకు రూ. 21 వేలనుంచి రూ. 74 వేలు.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ. 40 వేలనుంచి రూ. 1.40 లక్షలు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : మే 1.
దరఖాస్తు రుసుము : UR, ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మన్, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. రాత పరీక్ష మే 31న ఉంటుంది.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.irfc.co.in లో సంప్రదించండి.
ఇది కూడా చదవండి..: LIC HFL Jobs | ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ లో ఉద్యోగావకాశాలు