అక్షరటుడే, వెబ్‌డెస్క్: TG TET Results | తెలంగాణ Telangana రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలకమైన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలు సోమవారం (జులై 13) విడుదల కానున్నాయి.
ఇప్పటికే పరీక్షకు సంబంధించిన తుది ప్రక్రియలను పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు.
TG TET Results | పేపర్ – 1, పేపర్ – 2..
ఈ ఏడాది జూన్ 16 నుంచి 22 వరకు నిర్వహించిన టీజీ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1.15,028 మంది హాజరయ్యారు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ పోస్టులకు అర్హత కోసం నిర్వహించిన పేపర్-1తో పాటు, ఉన్నత ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించిన పేపర్-2 పరీక్షలు నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరిగాయి.
పరీక్ష అనంతరం ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణుల కమిటీ వాటిని పరిశీలించిన అనంతరం తుది ‘ఫైనల్ కీ’ని సిద్ధం చేసి, దాని ఆధారంగానే ఫలితాలను రూపొందించారు.
TG TET Results | ఫలితాలు ఎలా చూసుకోవాలి?
ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు టీజీ టెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ హాల్‌టికెట్ నంబర్, జన్మతేదీ వంటి వివరాలను నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డులో అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు అర్హత సాధించారా లేదా అనే వివరాలు అందుబాటులో ఉంటాయి.
TG TET Results | అర్హత మార్కులు ఇవే
టెట్‌లో అర్హత సాధించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మార్కులను అభ్యర్థులు పొందాల్సి ఉంటుంది. సాధారణ వర్గానికి 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధిస్తే టెట్‌లో అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.
ఉపాధ్యాయ నియామకాలకు కీలకం
రాష్ట్రంలో చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ ఫలితాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా రాబోయే టీచర్ నియామక ప్రక్రియల్లో పాల్గొనాలనుకునే వేలాది మంది అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.