Bangalore Kichaka Delivery Boy | బెంగళూరులో దారుణం: ఒంటరి యువతిపై డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. మహిళల రక్షణ ఎండమావేనా?

ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత ఆ కీచకుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న ఆ యువతికి తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నరాధముడు, తనను నమ్మి ఇంట్లోకి రానిచ్చిన యువతి అనే విచక్షణ కూడా మరచి ప్రవర్తించాడు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangalore Kichaka Delivery Boy | మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు, ఐటీ కారిడార్లలో నిఘా నేత్రాలు ఉన్నాయని వ్యవస్థలు ఎంత మొత్తుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఒంటరి మహిళలకు రక్షణ కరవైందనే చేదు నిజం మరోసారి బట్టబయలైంది.

సిలికాన్ సిటీ బెంగళూరులో డెలివరీ సర్వీసెస్​ మంటగలిపేలా, పురుష లోకం తలదించుకునేలా ఒంటరి యువతి పట్ల ఒక డెలివరీ బాయ్ అత్యంత నీచంగా ప్రవర్తించాడు.

Bangalore Kichaka Delivery Boy | అర్జెంట్ టాయిలెట్ నెపంతో బరితెగింపు

సమాజంలో మనుషుల రూపంలో తిరుగుతున్న కామాంధులు ఎంతలా తెగబడుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన ఒక డెలివరీ బాయ్, మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని దారుణానికి ఒడిగట్టాడు. “అర్జెంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాలి” అంటూ సదరు యువతిని బతిమిలాడాడు. ఆమె వద్దని వారించినా వినకుండా, బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు.

ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత ఆ కీచకుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న ఆ యువతికి తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నరాధముడు, తనను నమ్మి ఇంట్లోకి రానిచ్చిన యువతి అనే విచక్షణ కూడా మరచి ప్రవర్తించాడు.

Bangalore Kichaka Delivery Boy | మొబైల్‌లో రికార్డ్ చేసిన బాధితురాలు.. కన్నీటి పర్యంతం

ఆ క్లిష్ట పరిస్థితిలోనూ సదరు యువతి ఎంతో ధైర్యం ప్రదర్శించింది. ఆ కామాంధుడి అసభ్య ప్రవర్తనను, అతని వికృత చేష్టలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసింది. “వద్దని చెబుతున్నా వినకుండా ఇంట్లోకి చొరబడ్డాడు” అంటూ ఆ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఎదురైన ఈ చేదు అనుభవానికి ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురైంది.

చివరకు ఆ ధైర్యశాలి “పోలీసులకు ఫిర్యాదు చేస్తాను” అని గట్టిగా హెచ్చరించడంతో, ఆ కామాంధుడు భయపడి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బాధితురాలు సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Bangalore Kichaka Delivery Boy | సమాజం ఎటు పోతోంది? బాధ్యత ఎవరిది?

ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాక నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది ఇళ్లకు తిరిగే డెలివరీ బాయ్స్ ఇలాంటి కీచక పర్వాలకు పాల్పడితే, ఇక ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. డెలివరీ బాయ్స్‌ను నియమించుకునే సంస్థలు వారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సరిగ్గా చేస్తున్నాయా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Karnataka Transport Minister | బస్సులో మారువేషంలో మంత్రి ప్రయాణం.. డ్రైవర్, కండక్టర్ సస్పెండ్

Bangalore Kichaka Delivery Boy | పోలీసులు స్పందించాలని డిమాండ్​..

ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే కామాంధులపై చట్టం బూట్ కాలితో తొక్కాలని, వీరికి కఠినాతికఠినమైన శిక్షలు పడితేనే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఎవరైనా భయపడతారని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఒంటరి యువతిపై జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, ఆ కీచక డెలివరీ బాయ్‌ను కటకటాల్లోకి నెట్టాలని, బాధితురాలికి న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *