అక్షరటుడే వెబ్‌డెస్క్: Karnataka Transport Minister | ప్రజా రవాణాలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ వినూత్న ప్రయత్నం చేశారు. శనివారం ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ఎక్కిన ఆయనకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సుమారు రెండు గంటల పాటు 10కి పైగా బీఎంటీసీ (BMTC) బస్సుల్లో ప్రయాణించి, వ్యవస్థలోని లోపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
Karnataka Transport Minister | మంత్రికి ఎదురైన అనుభవాలు..
బస్సు ప్రయాణంలో మంత్రికి పలు సమస్యలు ఎదురయ్యాయి. ‘ఫన్ వరల్డ్’ బస్టాప్‌లో ఓ ప్రయాణికుడు దిగేందుకు సంకేతం ఇచ్చినా, డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు డ్రైవర్, కండక్టర్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. హెబ్బాళ్ – నాగశెట్టిహళ్లి రూటులో ప్రయాణిస్తున్నప్పుడు, టికెట్ కోసం రూ. 100 ఇవ్వగా.. చిల్లర లేదన్న సాకుతో కండక్టర్ కనీసం టికెట్ ఇవ్వకుండా, బస్సు దిగిపోవాలని కఠినంగా వ్యవహరించారు. నాగశెట్టిహళ్లిలో బస్సు దిగిన తర్వాత, మీటర్ ప్రకారం రూ. 30 చూపించినప్పటికీ, ఓ ఆటో డ్రైవర్ రూ. 36 డిమాండ్ చేయడం గమనించిన మంత్రి, వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు.
Karnataka Transport Minister |మంత్రి ఏమన్నారంటే?
తనిఖీల అనంతరం బైరతి సురేష్ మాట్లాడుతూ, “ప్రజా రవాణా వ్యవస్థలో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. బెంగళూరులో రాబోయే రోజుల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మరిన్ని కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. ప్రజా రవాణాలో ఉద్యోగుల బాధ్యతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Minister goes incognito !#Bengaluru: When #Karnataka’s transport minister Byrathi Suresh travelled like an ordinary passenger in #BMTC buses on Saturday night:
* A conductor ordered him to get off the bus not giving proper change while buying ticket
* The minister ordered… pic.twitter.com/FuhtcpyBOG
— TOI Bengaluru (@TOIBengaluru) July 12, 2026
ఇది కూడా చదవండి: Kashmir Cloudburst | జమ్మూ కశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. పోటెత్తిన వరద