Kashmir Cloudburst | జమ్మూ కశ్మీర్​లో క్లౌడ్​ బరస్ట్​.. పోటెత్తిన వరద

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో క్లౌడ్​ బరస్ట్​తో భారీ వర్షాలు కురిశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kashmir Cloudburst | దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ (Anantnag) జిల్లా చిత్తర్‌గుల్‌లోని నాలా చోటిహాల్ ప్రాంతంలో క్లౌడ్​ బరస్ట్​తో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు, వ్యవసాయ భూములు, పండ్ల తోటలు,నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి.

ఆకస్మిక వరదతో ఇళ్లలోకి నీరు చేరడం, వరి పొలాలు దెబ్బతినడం, ఆపిల్ తోటలు ప్రభావితం కావడం వంటి తీవ్ర విధ్వంసం జరిగిందని స్థానికులు తెలిపారు. పొలాలు, తోటలన్నీ నాశనమయ్యాయి. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.

cloudburst

Kashmir Cloudburst | దెబ్బతిన్న రోడ్లు

ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పలు రోడ్లు సైతం ధ్వంసం అయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని అంచనా వేసి, నివారణ చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర బృందాలను పంపింది. ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి షెల్టర్స్‌లో తలదాచుకున్నారు. వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

 

దీనిని కూడా చదవండి : Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్​ రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *