Wipro Religious Harassment | మతమార్పిడి రగడ..‘వేధింపులు సహించం’ అంటూ విప్రో వార్నింగ్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Wipro Religious Harassment | విప్రో (Wipro) సంస్థలో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని చేసిన మతమార్పిడి వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై ఐటీ దిగ్గజం విప్రో తాజాగా స్పందించింది. తమ కార్యాలయాల్లో ఎలాంటి వివక్షకు, వేధింపులకు తావులేదని.. అలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ విచారణలో తప్పు రుజువైతే సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ సిబ్బంది సంక్షేమం, ఆత్మగౌరవం, స్వేచ్ఛకు భంగం కలగకుండా.. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం పుణె పోలీసులు చేస్తున్న దర్యాప్తునకు సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని, విచారణలో భాగంగా అధికారులు కోరిన పలు కీలక పత్రాలను ఇప్పటికే అందజేసినట్లు వెల్లడించింది.

wipro.1

Wipro Religious Harassment | అసలేం జరిగిందంటే..?

బెంగళూరుకు చెందిన ఓ మహిళా టెక్కీ గతంలో పుణె హింజవాడిలోని విప్రో కార్యాలయంలో పనిచేశారు. ఆ సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తనను మతం మారాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

wipro.2

Wipro Religious Harassment | బాధితురాలి ఆరోపణ..

“ఇస్లాం మతంలోకి మారతావా.. లేక ఉద్యోగానికి రాజీనామా చేస్తావా?” అంటూ తనను మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై కంపెనీ అంతర్గత విభాగానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో, చివరికి తాను ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆమె హింజవాడి పోలీస్ స్టేషన్‌తో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు. ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విప్రో యాజమాన్యం అధికారికంగా స్పందించి వివరణ ఇచ్చింది.

ఇది కూడా చదవండి:  SU-57 Fighter Jets | ఎస్​యూ–57 యుద్ధ విమానాలు.. భారత్​కు రష్యా బిగ్​ ఆఫర్​..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *