School Recruitment | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ప్రైమరీ స్కూళ్లలో ఇన్​స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: School Recruitment | మండలంలోని (Mendora) ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ-ప్రైమరీ పాఠశాలల (Pre-primary schools) కోసం ఇన్​స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

School Recruitment | తాత్కాలిక ప్రాతిపదికన..

ఎంఈవో మాట్లాడుతూ.. సోన్‌పేట్, చాకిర్యాల్, బుస్సాపూర్, మెండోరా ప్రాథమిక పాఠశాలల్లో(primary schools) ఈ పోస్టులు ఉన్నాయన్నారు. తాత్కాలికంగా పది నెలల గౌరవ వేతనం ఆధారంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్​స్ట్రక్టర్ల పోస్టులకు (Instructor Jobs) ఇంటర్మీడియట్‌తో పాటు టీటీసీ(TTC) అర్హత ఉండాలని, ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు సంబంధిత హాబిటేషన్, గ్రామం లేదా మండలానికి చెందిన వారై ఉండాలని, 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని మండల విద్యాధికారి వెల్లడించారు.

school

school1

 

ఇది కూడా చదవండి: CMRL ED Probe | సీఎంఆర్‌ఎల్‌పై ఈడీ విచారణ.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *