Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎమ్మెల్యే ధన్​పాల్

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా మొక్క నాటి నీళ్లు పోశారు.

worlld2 1

Environmental Protection | భవిష్యత్తు తరాల కోసం..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. కాలుష్యాన్ని పెంచే పనులు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలనుకుంటే తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీజీహెచ్(Nizamabad GGH) ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *