Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain procurement issues | మండలంలోని(Yellareddy) హాజీపూర్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో (paddy transport issue) రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రహదారిపై ధాన్యం బస్తాలను తగలబెట్టి ధర్నాకు దిగారు.

Grain procurement issues | కాంటాలు పూర్తయి నెల కావస్తున్నా..

కొనుగోలు కేంద్రంలో కాంటాలు పూర్తయి దాదాపు నెల కావస్తున్నా లారీల రాకపోవడంతో ధాన్యం (paddy procurement) ఎక్కడికక్కడే పడి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించడం కంటే విక్రయించడమే కష్టంగా మారిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకపక్క వర్షాలు కురుస్తుండటంతో ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసి ముద్ద అవుతోందని, దానిని మళ్లీ ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోందని వాపోయారు. అటు లారీలు రాక ధాన్యం తరలకపోవడంతో కేంద్రం వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు, తరలించేందుకు అదనంగా డబ్బులు ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన చెందారు.

Grain procurement issues | స్తంభించిన ట్రాఫిక్​..

రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజు(Yellareddy Police), రెవెన్యూ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. వారం రోజుల్లోగా ఉన్న ధాన్యం మొత్తాన్ని తరలించేలా చర్యలు తీసుకుంటామని, వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేరవేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తహశీల్దార్ హామీతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి లారీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

opaddy

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *