అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ananya Panday Dance Trolls | సినీ నటి అనన్య పాండే డ్యాన్స్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘చాంద్ మేరా దిల్’ (Chand Mera Dil) చిత్రంలో ఆమె చేసిన భరత నాట్యం వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానిని భరత నాట్యం అంటారా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఒకవైపు అనన్య పాండే డాన్స్ సీన్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటే… మరోవైపు వ్యాపార వేత్త రాధికా మెర్చంట్ గ్రేస్‌ఫుల్ భరతనాట్యం అంటూ మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. అనన్య, రాధికా డ్యాన్స్ చూసి నేర్చుకోవాలి అంటూ పోలికలు పెడుతున్నారు. గతంలో రాధిక చేసిన నృత్య ప్రదర్శన వీడియోను తాజాగా వైరల్ చేస్తున్నారు.
Ananya Panday Dance Trolls | అసలు ఏం జరిగిందంటే..
అనన్య పాండే (Ananya Panday) ప్రస్తుతం చాంద్ మేరా దిల్ మూవీలో నటించారు. ఈ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్ సీన్ ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. భరతనాట్యం-ఫ్యూజన్ డ్యాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, చాలామంది నెటిజన్లు, నృత్యాభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.భరతనాట్యాన్ని అవమానించినట్టుంది అంటూ ట్రోల్ చేశారు. ఇది క్లాసికల్-ఫ్యూజన్ కాన్సెప్ట్‌తో రూపొందించారని సమాచారం. దీంతో కొంతమంది ప్రేక్షకులు ఆమె ప్రయత్నాన్ని సమర్థిస్తున్నారు. చిత్ర సహాయ కొరియోగ్రాఫర్ మాత్రం ఆ నటి ‘అద్భుతంగా చేసిందని’ పేర్కొన్నారు.
Ananya Panday Dance Trolls | మిశ్రమ స్పందన
చాంద్ మేరా దిల్ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. భరతనాట్య నృత్యకారిణి కూతురైన చాందిని పాత్రను అనన్య పోషించింది. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న సన్నివేశంలో, ఆమె పాత్ర సాంప్రదాయ నృత్యానికి బదులుగా, భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్‌తో మిళితం చేస్తూ ఒక ఫ్యూజన్ ప్రదర్శన ఇవ్వడానికి ఎంచుకున్నట్లు చూపించారు. ఇప్పటికే ఇలాంటి ఫ్యూజన్ ప్రదర్శకులు ఉన్నప్పటికీ, X లోని చాలా మంది ఆ సన్నివేశం అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Pawan Kalyan Karma | ‘ఎవరు తప్పు చేసినా కర్మ వదలదు.. న్యూటన్ థర్డ్ లా వర్తిస్తుంది’: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


