Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్‌కు భారీ స్పందన.. రామ్ చరణ్ మాస్ అవతార్‌కు ఫిదా అవుతున్న అభిమానులు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddi Trailer | మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కిస్తున్న భారీ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. తాజాగా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. విడుదలైన వెంటనే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రైలర్‌లోని మాస్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Peddi Trailer | డైలాగ్ అదుర్స్..

ముఖ్యంగా రామ్ చరణ్ చెప్పిన “ఆటే నా పొగరు” అనే డైలాగ్‌తో పాటు “మీరు అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు.. నేను పోరాడాను సార్” అనే డైలాగ్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ఈ డైలాగ్స్‌తో పాటు రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు (Director Buchi Babu) వరుస ఇంటర్వ్యూలలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ట్రైలర్ చూసిన తర్వాత బుచ్చిబాబు ఇచ్చిన హైప్‌కు తగ్గట్టుగానే సినిమా ఉండబోతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Peddi Trailer | చివరి 50 నిమిషాలు అత్యంత కీలకంగా

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 3 గంటల 2 నిమిషాల రన్‌టైమ్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యానికి బలమైన భావోద్వేగాలను జోడిస్తూ, పూర్తి కమర్షియల్ శైలిలో దర్శకుడు సినిమాను మలిచినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే సినిమాలో చివరి 50 నిమిషాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ భాగంలో ప్రేక్షకులు రామ్ చరణ్‌ను కాకుండా పూర్తిగా పాత్రలో లీనమైన ‘పెద్ది’ని మాత్రమే చూస్తారని దర్శకుడు Director నమ్మకంగా చెబుతున్నట్లు సమాచారం. ఇక సినిమా విడుదలకు ముందు జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sreeleela Dating Rumors | శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ రూమర్లపై క్లారిటీ.. అస‌లు విష‌యం ఇది అంటూ స్వర్ణలత స్పందన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *