TRS Flag Festival | టీఆర్ఎస్ జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ.. నెల రోజుల పాటు జెండా పండుగకు ఏర్పాట్లు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: TRS Flag Festival | రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆమె ఆవిష్కరించారు.

TRS Flag Festival | రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా..

మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని కవిత సూచించారు. జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో, పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్‌కు గ్రీన్ కలర్, పైభాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్ వేయాలని, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్‌ను బ్లూ కలర్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని, జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని స్పష్టం చేశారు.

పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే పాటించాలని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో కనిపిస్తాయని కవిత వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో, వార్డులో జెండా గద్దెల నిర్మాణం పూర్తి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి..: Indiramma House | కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని వేధింపులు.. కాంగ్రెస్​ నాయకుడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *