అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tungabhadra Crest Gates | తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం ప్రారంభించారు. రూ.51 కోట్లతో రికార్డు స్థాయిలో 6 నెలల్లో 33 కొత్త క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు.
తుంగభద్ర ప్రాజెక్ట్ 19వ గేటు గతంలో కొట్టుకుపోయింది. దీంతో ఎన్డీఎస్ఏ అధికారులు డ్యామ్‌ను పరిశీలించారు. అన్ని గేట్లను మార్చాలని సూచించారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు అధికారులు ఆరు నెలల్లో 33 కొత్త క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని గురువారం కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Tungabhadra Crest Gates | 3 గంటలకు తిరుగు పయనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో కర్ణాటకకు వెళ్లారు. హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించారు. గేట్ల ప్రారంభానికి ముందు హోసపేట ఐఆర్బీ అతిథి గృహంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సభ ముగిశాక మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
📅 25 June 2026 –Inauguration of all 33 newly installed crest gates,strengthening the future of this iconic reservoir
From overcoming challenges to creating history, the Tungabhadra Dam continues to stand as a symbol of resilience,engineering excellence & agricultural prosperity pic.twitter.com/IaHdLTH6K4
— Ballari Tweetz (@TweetzBallari) June 25, 2026
ఇది కూడా చదవండి..: Bakery Fire Accident | బేకరీలో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం