అక్షరటుడే, వెబ్‌డెస్క్: NBK112 Movie Launch | బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
బాలయ్య (Hero Balakrishna) నటిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ఎన్బీకే 112(#NBK112) ఖరారు చేశారు. అమరావతిలోని పూజ కార్యక్రమాలో షూటింగ్ మొదలైంది. రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌తో సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సమచారం.
NBK112 Movie Launch | క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్
బాలయ్య చిత్రానికి ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) క్లాప్ కొట్టారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్పి అలరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, నిర్మాత సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు. ఆయన నటించిన డాకు మహరాజ్, అఖండ–2 సూపర్ హిట్ సాధించాయి. దీంతో తాజాగా నటిస్తున్న చిత్రంపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
#NBK112 Satrted With #NandamuriBalakrishna Mass Dailouge
#NaraLokesh #Balayya pic.twitter.com/Ve0LTlU9nb
— Akshara Today | Telugu News (@aksharatoday) June 25, 2026
ఇది కూడా చదవండి..: Samantha Pregnancy News | ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత క్లారిటీ.. మెటర్నిటీ లీవ్ తీసుకుంటానన్న నటి