అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Domestic Stock Market | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన ట్యాంకర్లు బయటకు రావడంతో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. ఆసియా మార్కెట్లనుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో భారత బెంచ్‌మార్క్ సూచీలైన నిఫ్టీ (Nifty), సెన్సెక్స్ సైతం గురువారం భారీ లాభాల దిశగా పరుగులు తీస్తున్నాయి.
Domestic Stock Market | గ్యాప్ అప్ లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 111 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో 311 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో ప్రారంభమై 18 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 94 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 77,517 వద్ద, నిఫ్టీ 163 పాయింట్ల లాభంతో 24,184 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 4.68 శాతం, మారుతి 4.61 శాతం, ఎం అండ్ ఎం 3.53 శాతం, హెచ్‌యూఎల్ 1.72 శాతం, ఎస్బీఐ 1.51 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టైటాన్ 1.53 శాతం, పవర్‌గ్రిడ్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.90 శాతం, ఎయిర్టెల్ 0.70 శాతం, టాటా స్టీల్ 0.60 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: June 25 Gold Prices | ఎనిమిది నెలల కనిష్టానికి బంగారం ధర.. బలహీనపడిన వెండి