అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 28 Market Analysis | తరచూ పశ్చిమాసియా (West Asia)లో ఉద్రిక్తతల నేపథ్యంలో నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నెలకొన్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించవచ్చనే ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
July 28 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ఈ వారాంతంలో ప్రధాన టెక్నాలజీ కంపెనీల త్రైమాసిక ఆదాయాల ప్రకటన ఉండనుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ మిశ్రమంగా ముగిసింది. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరగ్గా.. నాస్‌డాక్ 0.18 శాతం పడిపోయింది. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.12 శాతం నష్టంతో ఉంది.
AV Ranganath HYDRAA | రాజ్యాంగ స్ఫూర్తితో హైడ్రా పని చేస్తోంది: కమిషనర్ ఏవీ రంగనాథ్
July 28 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.03 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.40 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.42 శాతం లాభపడ్డాయి.
July 28 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.27 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 9.35 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 4.40 శాతం తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.99 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.18 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.35 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.33 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,688 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,329 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 66 పైసలు బలపడి 95.91 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.14 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.64 వద్ద ఉన్నాయి.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.89 నుంచి 1.11 కు పెరిగింది.
- విక్స్ 9.76 శాతం తగ్గి 12.66 కు చేరింది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.11 డాలర్ల వద్ద ఉంది.