Oppo F33 | ఒప్పో నుంచి మరో క్రేజీ ఫోన్..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo F33 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smartphone) తయారీ సంస్థ ఒప్పో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్ ను తీసుకువచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ‘ఒప్పో ఎఫ33 5జీ ప్రో’ పేరుతో విడుదల చేసింది. దీనిలో భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్ అమర్చారు. ఇది ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తోపాటు అమెజాన్‌ (Amazon)లోనూ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు.
ఐపీ66, ఐపీ68, ఐపీ69 కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్‌లున్నాయి.

సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ఆక్టా కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలరఓఎస్ 16 తో పనిచేస్తుంది.

Oppo F33 | బ్యాటరీ సామర్థ్యం..

ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ ఉంది. ఐదు నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 1.6 గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చని, గంటపాటు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడవచ్చని కంపెనీ చెబుతోంది.

Oppo F33 | కెమెరా సెటప్..

వెనక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పనిచేస్తుంది. రెండో కెమెరా సామర్థ్యం 2 మెగాపిక్సెల్. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సెగ్మెంట్ బెస్ట్ క్లారిటీ గ్రూప్ సెల్ఫీ కెమెరాగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కెమెరాల్లో లేటెస్ట్, పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. వీటితో 4కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు.

Oppo F33 | వేరియంట్స్..

ఈ ఫోన్ మిస్టీ ఫారెస్ట్, ప్యాషన్ రెడ్, స్టారీ బ్లూ కలర్‌లలో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
8 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 37,999.
8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.40,999.

కార్డ్ ఆఫర్స్ : ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, యస్ బ్యాంక్‌ల క్రెడిట్‌కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4,100 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Tech Layoffs | బిగ్ షాక్.. 16 వేల మందికి ఉద్వాసన!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *