RBI MPC Meeting | ఆర్బీఐ తీర్మానాల వైపు.. ఇన్వెస్టర్ల చూపు!

వడ్డీ రేట్ల పెంపు అంశంతోపాటు వృద్ధిపై ఆర్బీఐ ఎలాంటి కామెంట్లు చేస్తుందోనని ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: RBI MPC Meeting | ద్రవ్య పరపతి విధాన నిర్ణయం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వైమాసిక సమావేశాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 5న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశాలు.. అక్టోబర్ 7న(బుధవారం) ఉదయం ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ సమావేశ తీర్మానాలను ప్రకటించనున్నారు.

RBI MPC Meeting | మార్కెట్ అంచనాలు..

మార్కెట్ ప్రధానంగా 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపును అంచనా వేస్తోంది. అయితే జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారోనని ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారు.

Also read : Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ద్రవ్యలోటుతోపాటు ఇన్ఫ్లెషన్ పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అంచనాలకన్నా ఎక్కువగా వడ్డీ రేటు పెంచినా.. వృద్ధి అంచనాలపై ఆర్బీఐ గవర్నర్ నెగెటివ్ కామెంట్లు చేసినా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి.

RBI MPC Meeting | రేటు పెంపు ప్రభావం..

రెపో రేటును పెంచితే హోమ్ లోన్ ఈఎంఐ భారం పెరగనుంది. అలాగే స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురవుతుంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో షేర్లపై ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. మార్కెట్ అంచనా వేస్తున్నట్లుగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపునకు పరిమితమైతే మార్కెట్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

25 బేసిస్ పాయింట్లకన్నా ఎక్కువగా రెపో రేటును పెంచితే మాత్రం స్టాక్ మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతుందని భావిస్తున్నారు. ఇక అందరి అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచితే బుల్స్‌కు రెండువారాల ముందే దసరా పండుగ వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *