అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 27 Gold Prices | దీపావళి Diwali పండగ సమీపిస్తున్న వేళ పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పండగ డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పుంజుకుంటున్నాయి. దీపావళి సెంటిమెంట్‌తో కొనుగోళ్లు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై వస్తున్న అంచనాలు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Oct 27 Gold Prices | వివిధ నగరాల్లో బంగారం ధరలు
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల (తులం) బంగారం ధరలు ఊహించని రీతిలో రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం..
- 24 క్యారెట్ల (మేలిమి) బంగారం: రూ. 1,42,760
- 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం: రూ. 1,30,860
న్యూఢిల్లీ..
- 24 క్యారెట్ల బంగారం: రూ. 1,42,910
- 22 క్యారెట్ల బంగారం: రూ. 1,31,010
చెన్నై & బెంగళూరు..
- 24 క్యారెట్ల బంగారం: రూ. 1,42,760
- 22 క్యారెట్ల బంగారం: రూ. 1,30,860
Oct 27 Gold Prices | వెండి ధరల ట్రెండ్
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,19,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిన్న చెన్నైలో కేజీ వెండి రూ. 2.20 లక్షల వద్ద ఉండగా, స్వల్పంగా తగ్గి రూ. 2.19.900కు చేరింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Oct 27 Gold Prices | ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
ధన్‌తేరస్,దీపావళి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం శుభసూచకంగా భావించడంతో మార్కెట్‌లో స్వదేశీ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం పసిడిని భారీగా సేకరిస్తుండటం కూడా ఈ ధరల పెరుగుదలకు బలమైన కారణంగా నిలుస్తోంది.