అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు డాలర్‌కు 114 డాలర్లకు చేరాయి. ఎక్కువగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌కు ఇది ప్రతికూలాంశం. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది.
Indian Stock Market | లాభాలతో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 416 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 101 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,279 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 45 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 380 పాయింట్లు పడిపోయింది. చివరి రెండు గంటల్లో కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్ కనిపించింది. దీంతో నష్టాలు కాస్త తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 73,123 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 22,600 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 933 కంపెనీలు లాభపడగా 3,485 స్టాక్స్ నష్టపోయాయి. 177 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 63 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 718 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో, 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.97 శాతం, ఎల్టీ 1.25 శాతం, రిలయన్స్ 1.19 శాతం, టీసీఎస్ 1 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.83 శాతం పెరిగాయి.
Top Losers : టాటా స్టీల్ 3.21 శాతం, అదానీపోర్ట్స్ 3.03 శాతం, ట్రెంట్ 2.13 శాతం, టెక్ మహీంద్రా 1.95 శాతం, బీఈఎల్ 1.88 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Oppo Find X10 Pro Max | అధునాతన ప్రాసెసర్‌తో ప్రీమియం ఫోన్.. ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రొ మ్యాక్స్ విడుదల