Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ వరల్డ్ రికార్డ్.. కోటి దాటిన ఐపీవో అప్లికేషన్లు

దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా వచ్చిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్.. సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఐపీవో దరఖాస్తులు కోటి దాటాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో (IPO)కు అద్భుత స్పందన లభిస్తోంది. ఈ ఐపీవో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన జియో ప్లాట్‌ఫామ్స్.. సబ్‌స్క్రిప్షన్ల పరంగానూ కొత్త రికార్డు నెలకొల్పింది.

Jio Platforms IPO | అత్యధిక అప్లికేషన్లు పొందిన ఐపీవోగా

అక్టోబర23 మధ్యాహ్నం సమయానికే కోటికిపైగా దరఖాస్తులు వచ్చాయి. తద్వారా కోటికిపైగా బిడ్లు దాఖలైన తొలి ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. ఈ క్రమంలో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ అత్యధిక అప్లికేషన్లు పొందిన ఐపీవోగా చరిత్ర సృష్టించింది. అంతకుముందు మన దేశానికే చెందిన వారీ ఎనర్జీస్ పేరిట ఉంది. ఆ సంస్థ ఐపీవోకు 97 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, భారత్ కోకింగ్ కోల్ పబ్లిక్ ఇష్యూలకు 90 లక్షలకన్నా ఎక్కువ బిడ్లు వచ్చాయి. వీటన్నింటిని జియో ప్లాట్‌ఫామ్స్ అధిగమించడం గమనార్హం. ప్రపంచ ప్రైమరీ మార్కెట్ చరిత్రలోనే కోటి అప్లికేషన్లను దాటిన తొలి ఐపీవోగా రికార్డులకెక్కిన జియో ప్లాట్ ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | మార్కెట్లలో ఆగని పతనం.. నాలుగో రోజూ నష్టాలే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *