Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు!

కామారెడ్డి పట్టణంలో నెల రోజుల క్రితం రెండేళ్ల బాలుడు కిడ్నాప్​నకు గురయ్యాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Child Kidnapping | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో నెల రోజుల క్రితం రెండేళ్ల బాలుడు కిడ్నాప్​నకు గురయ్యాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా తల్లిదండ్రులతో వచ్చిన బాలుడు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Kamareddy Child Kidnapping  | సాంకేతిక పరిజ్ఞానంతో..

సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు వివరాలు సేకరించి నమ్మదగిన సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలుడిని దాచినట్టుగా గుర్తించారని సమాచారం. ఇంట్లోని ఓ గదిలో తాళం వేసి ఉండగా అందులో ఉన్న బాలుడిని బయటకు తీసుకువచ్చి భార్యాభర్తలను అడగగా పొంతన లేని సమాధానం చెప్పినట్లుగా తెలిసింది. అదేరోజు బాలుడిని తీసుకొచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.

Kamareddy Child Kidnapping | పెంచుకోవడానికేనా..?

ఈ కిడ్నాప్​నకు కారణం ఏమిటో ఇంకా తేలలేదు. అయితే బాలుడిని పెంచుకోవడం కోసం కిడ్నాప్ చేశారన్న ప్రచారం బయట సాగుతోంది. పోలీసుల విచారణలో అసలు కారణం తేలుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందోనని పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం. ఈ విషయమై కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్​ను వివరణ కోరగా బాలుడి కిడ్నాప్ విషయంలో విచారణ కొనసాగుతుందన్నారు. బాలుడిని పెంచుకోవడం కోసమే తీసుకెళ్లినట్టుగా తెలుస్తుందన్నారు. విచారణ కొనసాగుతుందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Bigala Ganesh Gupta | ఘనంగా మాజీఎమ్మెల్యే బిగాల అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *