అక్షరటుడే, ఇందూరు: Voter Revision | పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.
Voter Revision | ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ను..
బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా బీఎల్వో రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డి పాలనాధికారి ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) కలిసి ఎన్యుమరేషన్ ఫారం అందించారు. వీటిని పూరించి, ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్వో మొబైల్ యాప్‌లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం కరెక్ట్‌గా నింపే విధంగా చూడాలని బీఎల్వోలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహశీల్దార్ వినయ్ సాగర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..